- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ప్రధానిది సున్నిత మనస్తత్వం: శరద్ పవార్
ముంబై: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్‌ది సున్నితమైన మనస్తత్వం అని కొనియాడారు. పూణెలో నిర్వహించిన ఆక్రోశ్ మోర్చా ముగింపు సభలో పవార్ ప్రసంగించారు. ‘కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ మహారాష్ట్రలోని అమరావతిని సందర్శించారు. ఆయన ప్రజలతో పాటు రైతుల పట్ల కూడా సున్నితంగా ఉండేవారు. ఆ టైంలో రూ. 72,000 కోట్ల వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేశారు’ అని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మన్మోహన్ కేబినెట్‌లో శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శివసేన(ఉద్దవ్) వర్గం నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను లేవనెత్తినందుకే ఎన్సీపీ నేతలు సుప్రియా సూలే, అమోల్ కోల్హేలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బీజేపీ విజయం కేవలం ఈవీఎంల మీదనే ఆధారపడిందని..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు లేకుంటే కాషాయపార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవదని ఎద్దేవా చేశారు.