- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హర్యానా కొత్త ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇదే!
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయీబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేతగా సైనీని పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సైనీ కురుక్షేత్ర పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాక బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నారు. మాజీ సీఎం ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాగా, బీజేపీ- జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) పొత్తుకు బ్రేక్ పడటంతో మనోహర్ లాల్ కట్టర్ సీఎం పదవికి రిజైన్ చేశారు. గవర్నర్‌కు రాజీనామా పత్రం అందజేసిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి సైనీని సీఎంగా ఎన్నుకున్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ స్వతంత్ర అభ్యర్థులతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
డిప్యూటీ సీఎంగా జాట్ నేత!
కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, జాట్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ సీఎంగా నియమించే చాన్స్ ఉంది. ఇప్పటి వరకు అదే సామాజికి వర్గానికి చెందిన దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ, జేజేపీల పొత్తు తెగిపోవడంతో మరోసారి బీజేపీకి చెందిన జాట్ ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎం చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పోటీలో ఎవరెవరు ఉన్నారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీఎంతో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.
సైనీ ప్రస్థానం..
సైనీ1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మిజాపూర్ మజ్రా గ్రామంలో జన్మించాడు. 1996లో బీజేపీలో చేరిన సైనీ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2016లో ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై విజయం సాధించారు. 2023 అక్టోబర్ 27నుంచి హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో సుధీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సైనీని బీజేపీ అధిష్టానం తాజాగా సీఎంగా ఎంపిక చేసింది.