- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హర్యానాలో మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా 8 మంది ప్రమాణం
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల హర్యానాలో సంక్షోభం నేపథ్యంలో నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఐదు మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, మంగళవారం సీఎం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హాజరయ్యారు.
కొత్తగా క్యాబినెట్లోకి వచ్చిన వారిలో హిసార్కు చెందిన ఎమ్మెల్యే కమల్ గుప్తా, బద్ఖల్ ఎమ్మెల్యే సీమా త్రిఖా, పానిపట్ రూరల్ ఎమ్మెల్యే మహిపాల్ దండా, అంబాలా సిటీ ఎమ్మెల్యే అసీమ్ గోయెల్, నంగల్ చౌదరి ఎమ్మెల్యే అభే సింగ్ యాదవ్, థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధా, బవానీ ఖేరా ఎమ్మెల్యే బిషంబర్ సింగ్ బాల్మీకి, సోహ్నా ఎమ్మెల్యే సంజయ్ సింగ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.