Haryana Assembly elections: 9 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆప్

by Shamantha N |
Haryana Assembly elections: 9 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana elections) కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)‌ రెండో జాబితాను విడుదల చేసింది. 9 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. అప్, కాంగ్రెస్‌ (Congress) పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ లేదు. సీట్ల పంపకాలపై ఒప్పందం కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగానే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది. సోమవారం 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ఢిల్లీ పార్టీ.. మంగళవారం 9 మందితో మరో జాబితాను కూడా విడుదల చేసింది. దీంతో, ఇప్పటివరకు 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లైంది. సధౌరా నుంచి రీటా బమానియా, తానేసర్ నుంచి క్రిషన్ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్, రాటియా నుంచి ముఖ్తియార్ సింగ్ బాజీగర్ ని బరిలో దింపింది. అదంపూర్ నుంచి అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్, బర్వాల నుంచి ప్రొ. చతర్ పాల్ సింగ్, బవాల్ నుంచి జవహర్ లాల్, ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, టైగావ్ నుంచి అబాష్ చండేలా అప్ తరఫున పోటీ చేస్తున్నారు.

కొలిక్కిరాని చర్చలు

ఇకపోతే, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏడు స్థానాలనే వదులుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పటివరకూ పొత్తు చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కాగా.. అక్టోబర్ 5 న హర్యానాలో పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓటింగ్ జరగనుంది. ఇకపోతే, సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో ఆప్‌కు కాంగ్రెస్ ఒక స్థానాన్ని కేటాయించింది. అయితే, అక్కడ ఆప్ విఫలమైంది. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది.

Advertisement

Next Story

Most Viewed