సహజీవనానికి రిజిస్ట్రేషన్ ‘వెర్రి ఆలోచన’.. ఆగ్రహాం వ్యక్తం చేసిన సీజేఐ

by Javid Pasha |   ( Updated:2023-03-20 10:20:09.0  )
సహజీవనానికి రిజిస్ట్రేషన్ ‘వెర్రి ఆలోచన’.. ఆగ్రహాం వ్యక్తం చేసిన సీజేఐ
X

న్యూఢిల్లీ: లివిన్ రిలేషన్‌షిప్ లేదా సహాజీవనాలను రిజిస్టర్ చేసేందుకు నిబంధనలు తీసుకురావాలన్న పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది వెర్రి ఆలోచన అని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి లివిన్ రిలేషన్‌షిప్‌కు తప్పనిసరి రిజిస్ట్రేషన్ కల్పించేలా నిబంధనలు తీసుకురావాలని సోమవారం పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా వీరికి సామాజిక భద్రత కల్పించాలని పేర్కొన్నారు. దీని ద్వారా సహాజీవన భాగస్వాములతో నేరాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘ప్రజలు ఎలాంటి అంశాన్ని తీసుకొని వస్తారా? ఇలాంటి కేసులపై మూల్యం చెల్లించక తప్పదు.

అయిన రిజిస్ట్రేషన్ ఎవరితో చేయిస్తారు.. కేంద్ర ప్రభుత్వంతోనా? లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారితో ప్రభుత్వానికి ఏం సంబంధం?’ అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల భద్రతను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా వ్యక్తులను లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండనివ్వకుండా చేస్తున్నారా అని మండిపడ్డారు. తాజాగా సహాజీవనం చేస్తున్న జంటల్లో వరుస హత్యాఘటనల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.


Advertisement

Next Story

Most Viewed