- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు: మణిపూర్‌లో ఒకరు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. తాజాగా శనివారం ఉదయం కాంగ్ పోక్పి జిల్లాలో రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ వాలంటీర్ మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సాయుధ వ్యక్తులు సతాంగ్ కుకీ కొండ నుంచి గ్రామంలోకి ప్రవేశించి బాంబు దాడి చేయడంతో ఘర్షణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే వాలంటీర్ మృతి చెందినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న బలగాలు సతాంగ్ గ్రామానికి చేరుకోవడంతో పరిస్థితి శాంతించినట్టు తెలిపారు. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు జనవరి18న జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో మెయితీ వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఆ తర్వాత జరిగిన సాయుధుల కాల్పుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది మృతి చెందారు. మరోవైపు బుధవారం అర్ధరాత్రి సాయుధ దుండగుల మధ్య జరిగిన కాల్పుల్లో హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న వ్యక్తి మృతదేహాన్ని కాంగ్‌పోక్పి జిల్లా సరిహద్దులో ఉన్న కాంగ్‌చుప్‌లో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.