- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సూర్య నమస్కారాల్లో గుజరాత్ గిన్నీస్ రికార్డు
by samatah |

X
దిశ, నేషనల్ బ్యూరో: 108 ప్రాంతాల్లో ఒకే సారి సూర్య నమస్కారాలు చేసి గుజరాత్ గిన్నీస్ రికార్డు నెలకొల్పింది. సోమవారం ఉదయం ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సుమారు 4000 మంది పాల్గొని 51 విభిన్న పద్దతుల్లో సూర్య నమస్కారాలు చేశారు. ఈ ఈవెంట్‌లో విద్యార్థులు, యోగా ప్రేమికులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. మోదెరా ఆలయంలో జరిగిన ప్రదర్శనలకు సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష సంఘవిలు స్వయంగా హాజరయ్యారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు తరఫున కార్యక్రమాన్ని వీక్షించిన స్వప్నిల్ దంగరికల్ గిన్నీస్ రికార్డును ధ్రువీకరించారు. ఈ ఘనత సాధిచడంతో ప్రధాని మోడీ గుజరాత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2024ను అరుదైన ఫీట్‌తో స్వాగతించడం హర్షించదగ్గ విషయమని ఎక్స్‌లో పోస్టు చేశారు. సూర్య నమస్కారాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని కోరారు.
Next Story