- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VK Saxena: కోచింగ్ సెంటర్ ఘటనలో దోషులకు శిక్ష తప్పదు: ఢిల్లీ గవర్నర్ సక్సేనా
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు చేరడం వల్ల ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంపై స్పందించిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఆమోదించదగినవి కాదు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేసి జూలై 30లోగా నివేదిక సమర్పించాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పుస్తకం తీసుకురానున్నట్టు చెప్పారు. 'పరిపాలనలో ఉదాసీనత, కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్న వారి నేరపూరిత ప్రవర్తన కారణంగా కోల్పోయిన ప్రాణాలను తీసుకురాలేనప్పటికీ, ప్రాణ నష్టానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయి. దోషులను చట్టం ముందుకు తీసుకురావడం జరుగుతుందని గవర్నర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జరిగింది క్షమించరానిది, ఇలాంటిని కప్పి పుచ్చలేం. ఒక కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో నీరు నిలిచిపోవడంతో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మరణించడం, వాటర్‌లాగింగ్ సంబంధిత విద్యుదాఘాతం కారణంగా మరొక విద్యార్థి మరణించడం నన్ను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఇది దేశ రాజధానిలో జరగడం అత్యంత దురదృష్టకరం, ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.