Nirmala Sitharaman అధ్యక్షతన GST కౌన్సిల్ సమావేశం..

by Satheesh |   ( Updated:2023-02-18 14:01:13.0  )
Nirmala Sitharaman అధ్యక్షతన GST కౌన్సిల్ సమావేశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 49వ జీస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ మీటింగ్ కు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రాష్ట్రాల సీనియర్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై పన్ను ఎగవేత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ అంశంలో తాజా మీటింగ్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

అలాగే జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ పై కూడా నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఆమె ఈ కామెంట్స్ చేసిన తర్వాత జరుగుతున్న తొలి కౌన్సిల్ మీటింగ్ ఇదే కావడంతో ఈ అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Also Read...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టేషనరీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Advertisement

Next Story

Most Viewed