- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Group-2 Exams: ఒకే రోజు గ్రూప్-2, రైల్వే ఎగ్జామ్స్.. ఆందోళనలో అభ్యర్థులు..!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా తెలంగాణ రాష్టంలో గ్రూప్-2(Group-2) పరీక్షలను టీజీపీఎస్సీ(TGPSC) డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు(RRB) జూనియర్ ఇంజినీర్(JE) పోస్టుల భర్తీకి డిసెంబర్ 16, 17, 18వ తేదీల్లో పరీక్షలు జరుపుతోంది. అయితే.. గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్షలకు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో ఒకే రోజు రెండు ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో ఏ పరీక్ష రాయలో తెలియక అభ్యర్థులు తికమకపడుతున్నారు. ఒక పరీక్ష కోసం మరో పరీక్షను వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీంతో ఈ రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని రైల్వే శాఖ(Indian Railway)తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని(TG State Govt) కోరుతున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడక తప్పదు.