- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ పార్టీ గూండాయిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ బీజేపీ ఎంపీ.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం(BJP office) ముట్టడించారు. అనంతరం దిష్టిబొమ్మ(effigy)ను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు(Congress leaders).. బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయగా ఇద్దరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి(BJP leaders were injured). కాగా ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి) వెంటనే స్పందించారు. మమ్మల్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ గూండాయిజాన్ని(Congress party hooliganism) తీవ్రంగా ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కేంత్ర మంత్రి తన ట్వీట్‌లో "హైదరాబాద్‌లోని నాంపల్లి కార్యాలయంలో మా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గూండాలు, దుండగులు, హింసాకాండకు స్వేచ్ఛ నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధర్మం లోకి కూరుకుపోవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ హయాంలో గూండాయిజం కొత్త ఆనవాయితీగా మారింది. మా కార్యాలయాలపై ఇటువంటి హింసాత్మక దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని.. ఈ కాంగ్రెస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను." అని కిషన్ రెడ్డి(Kishan Reddy) రాసుకొచ్చారు.