పిల్లల ఫ్యూచర్ బాగుండాలా.. మార్నింగ్ వేళ తల్లిదండ్రులు చేయాల్సినవివే?

by Anjali |
పిల్లల ఫ్యూచర్ బాగుండాలా.. మార్నింగ్ వేళ తల్లిదండ్రులు చేయాల్సినవివే?
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు పాఠశాలకెళ్లి నేర్చుకునేదాని కన్నా.. తల్లిదండ్రుల వద్దనుంచే ఇంట్లోనే ఎక్కువగా నేర్చుకుంటారు. కాగా పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే తల్లిదండ్రులు ఉదయం ఈ పనులు చేయాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీకు మార్నింగే నిద్రలేచే అలవాటు లేకపోతే.. పిల్లల్ని కూడా లేపరు. దీంతో పిల్లలు లేజీగా తయారు అవుతారు. కాగా ఎప్పుడైనా తల్లిదండ్రులు ఉదయాన్నే నిద్రలేచి.. మీ పిల్లల్ని లేపండి. ఆ సమయంలో ప్రశాంతమైన వాతావరణం(Peaceful atmosphere) పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో పిల్లల మానసిక ఆరోగ్యం(mental health) బాగుంటుంది. మార్నింగ్ వేళ ఇంట్లో పనులు కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మీ ఇంటిలో సానుకూల భావనలు కలుగుతాయి.

ఉదయం నిద్రలేస్తే పిల్లలు ఒక ప్రణాళిక ప్రకారం పని చేసుకోవడాన్ని నేర్పిస్తుంది.మార్నింగ్ లేవగానే చిరాకు పడటం.. ఆఫీసుకు లేట్ అయిపోయిందే.. ఫుడ్ ఎప్పుడూ ప్రిపెర్ చేయాలి అంటూ పిల్లల ముందు కంగారుపడడం మానేయండి. పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. కాగా మార్నింగ్ లేచి.. పిల్లలతో కలిసి వ్యాయామాలు(Exercises) చేయండి. దీంతో చికాకు, కోసం తొలగిపోతాయి. అలాగే పొద్దున్నే కాసేపు పుస్తకాలు(Books), వార్తాపత్రికలు(newspapers) చదవడం నేర్పియండి. ఇవి వారి వ్యక్తిత్వం పెంపొందించడానికి, విలువల(values)ను నేర్పడానికి మేలు చేస్తాయి.

అలాగే రేపు ఉదయం ఏం చేయబోతున్నారనేది పిల్లలతో చర్చించండి. ఫోన్లు(Phones), టీవీ(TV)లకు దూరంగా ఉండండి. పిల్లలు కూడా దూరంగా ఉండేలా చూసుకోండి. ఉదయం పూట సమయం ఉంటే వ్యాయామంతో పాటు ధ్యానం(Meditation), శ్వాస వ్యాయామాలు(breathing exercises) కూడా చేయండి. ఇవి ఒత్తిని దూరం చేస్తాయి. ముఖ్యంగా మార్నింగ్ సమయంలో బ్రేక్ ఫాస్ట్ కోసం పండ్లు(Fruits), తృణధాన్యాలు(whole grains), ప్రోటీన్(protein) అధికంగా ఉన్నవి తీసుకోవాలి.

ఈ ఆహారాలు పిల్లల్లో శారీరక బలాన్ని చేకూర్చుతాయి. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. కాగా పిల్లలకు పోషకాహారం (nutrition)ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలతో ఉదయం వేళ ఓపికగా మాట్లాడాలి. ప్రేమతో మంచి నడవడికు నేర్పించండి. ఇతరులతో ఎలా నడుచుకోవాలో చెప్పండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story