Budget Session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి బడ్జెట్ సెషన్

by Hajipasha |
Budget Session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి బడ్జెట్ సెషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం(జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాజ్యసభ, లోక్‌సభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో జులై 21న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12న ముగిసే అవకాశం ఉంది. ఈవిషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో తెలిపారు.

ఉభయసభలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఈ భేటీలో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభలో విపక్ష ఉపనేత ప్రమోద్ తివారీ పాల్గొననున్నారు. కాగా, బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed