రైతులకు మరో భారీ గుడ్‌న్యూస్ అందించిన ప్రభుత్వం.. పీఎం కిసాన్ యోజన కింద!

by Anjali |
రైతులకు మరో భారీ గుడ్‌న్యూస్ అందించిన ప్రభుత్వం.. పీఎం కిసాన్ యోజన కింద!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. పీఎం కిసాన్ యోజన పథకం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన్ కింద పట్టదారు కుటుంబానికి సంవత్సరానికి 6000 రూపాయలు అందిస్తుంది. అలాగే పీఎం మోడీ కిసాన్ 16 వ విడత నిధులు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనాలంతా 17 వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే కచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇది ఆన్ లైన్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి మీ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేకపోతే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ-కేవైసీ కంప్లీట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక సాచురేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేయించుకోని వారు నేరుగా అధికారుల చేత మీ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ-కేవైసీ చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికార పోర్టల్ pmkisan.gov.in అక్కడ సమాచారంతో పూర్తి చేయవచ్చు. లేకపోతే హెల్ప్ లైన్ 155261, 011-24300606 నెంబర్‌కు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం అందుతుంది.

Advertisement

Next Story