కొత్త సిటీల ఏర్పాటుకు కేంద్రం ప్లాన్..

by Vinod kumar |
కొత్త సిటీల ఏర్పాటుకు కేంద్రం ప్లాన్..
X

ఇండోర్: దేశంలో మరో 8 కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో సిఫారసు చేసిందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ అధికారి ఎం.బి.సింగ్ తెలిపారు. 26 కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాయని, కేంద్ర ప్రభుత్వం మాత్రం 8 కొత్త నగరాలను అభివృద్ధి చేసే విషయాన్ని పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

కొత్త నగరాలను ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తామో ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందన్నారు. కొత్త నగరాలను అభివృద్ధి చేస్తే కనీసం 200 కిలోమీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. కొత్త నగరాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్థిక రోడ్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని, అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.

Advertisement

Next Story