షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ మార్కెట్‌లో ఏ వస్తువైనా అతితక్కువ ధరలకే లభ్యం

by Anjali |   ( Updated:2023-05-09 09:20:54.0  )
షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ మార్కెట్‌లో ఏ వస్తువైనా అతితక్కువ ధరలకే లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: షాపింగ్ చేయడం అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది ఆర్థిక సమస్యల వల్ల అక్కడే ఆగిపోతారు. అలాంటి వారు ఈ తీపికబురు తప్పకుండా వినాల్సిందే. ఢిల్లీలోని కరోల్ బాగ్ అనే మార్కెట్‌లో ఖరీదైనవే కాకుండా.. చౌక ధరలకు లభించే అన్నీ వస్తువులు ఉంటాయట. ఈ మార్కెట్‌కు కరోల్ బాగ్ అని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు పెట్టారు. ఇక్కడ పెళ్లికి సంబంధించిన బట్టలు, లెహంగాలు, షేర్వాణీలు ఫేమస్. ఎక్కువమంది మెహందీ, రిసెప్షన్, వివాహ దుస్తులు కొనడానికే వస్తారు. అలాగే లేటెస్ట్ డిజైన్ వెండి, బంగారం, డైమండ్స్, న్యూ మోడల్ గాజులు, రింగ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్‌లో ఆక్సిడైజ్డ్ నగల ఖరీదు కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇక్కడ సెకండ్ హ్యండ్ పుస్తకాలు రూ.50 లోపే దొరకుతాయి.

అమ్మాయిల మేకప్ ఐటెమ్స్, షూస్, స్నీకర్స్, లోఫర్స్, చెప్పులు, స్లిప్పర్స్, బెల్లీస్ వంటి పలు రకాల పాదరక్షలు చాలా తక్కువ ధరలకే వస్తాయి. ఉత్తమ శ్రేణి కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కాగా.. విక్టోరియా సీక్రెట్ మిస్ట్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కిన్ ,హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సొంతగా షాప్ పెట్టాలనుకునే వారు ఈ మార్కెట్‌లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ మార్కెట్‌కు దారి.. పశ్చిమ ఢిల్లీ నుంచి సమీప మెట్రో స్టేషన్ బ్లూ లైన్‌లో ఉంటుంది. గేట్ నంబర్ 4 నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రిక్షా లేదా ఆటో తీసుకోని వెళ్లొచ్చు. ఢిల్లీకి కొత్తగా షాపింగ్ చేయాలని వచ్చే వారికి ఇక్కడే అతి తక్కువ ధరలోనే లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed