ఢిల్లీ గవర్నర్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ..

by Vinod kumar |
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ)లో సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని గవర్నర్ కు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య కార్పొరేషన్ లో ప్రజలచే ఎన్నుకోబడిన పౌర సంస్థను అస్థిరపరచడమేనని పేర్కొన్నది. ఈ నామినేటెడ్ సభ్యుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అంత ఆత్రుత ఎందుకని ప్రశ్నించింది. మంత్రివర్గ సలహా తీసుకోకుండానే డీఎంసీలో సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై తీర్పును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. డీఎంసీలో 250 మంది ఎన్నికైన సభ్యులు, 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఈ నామినేటెడ్ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. గతేడాది డిసెంబరులో జరిగిన డీఎంసీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 వార్డులను, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను గెలుచుకుంది. దీంతో ఎంసీడీలో కాషాయ పార్టీ అధికారానికి 15 ఏళ్ల తర్వాత తెరపడింది.

Advertisement

Next Story