గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ మర్డర్ సీన్ను రిక్రియేట్ చేసిన జ్యూడిషియల్ కమిషన్

by Javid Pasha |   ( Updated:2023-04-22 15:34:22.0  )
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ మర్డర్ సీన్ను రిక్రియేట్ చేసిన జ్యూడిషియల్ కమిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు ఈ నెల 15న హత్యకు గురైన విషయం తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ లను తీసుకెళ్తుండగా విలేకర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అతి దగ్గర నుంచి రివాల్వర్లతో కాల్చి చంపారు. అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. కాగా తాజాగా జ్యూడిషియల్ కమిషన్ అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ల హత్యకు సంబంధించిన సీన్ ను రిక్రియేట్ చేశారు. నిందితులతోనే కమిషన్ సభ్యులు సీన్ రిక్రియేట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed