- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
French envoy: ఫ్రాన్స్ రాయబారి ఫోన్ స్వాధీనం.. నలుగురు అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ రాయబారి(French envoy) ఫోన్ చోరీ కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. అక్టోబర్ 20న ఫ్రాన్స్ రాయబారి థిర్రీ మాథౌ తన భార్యతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్‌ను సందర్శించారు. దీపావళి నేపథ్యంలో అక్కడ షాపింగ్ చేశారు. అయితే రద్దీ బజార్‌లో ఆయన మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ రాయబారి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు .
ఆన్ లైన్ లో ఫిర్యాదు
ఇకపోతే, దీపావళి పండుగ సందర్భంగా చాందినీ చౌక్ మర్కెట్(Chandni Chowk) జనంతో కిటకిటలాడింది. ఆ ప్రాంతంలోని జైన్ టెంపుల్ సమీపంలో ఫ్రెంచ్ రాయబారి మాథౌ మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. దీంతో ఫ్రెంచ్ ఎంబీసీ దీని గురించి ఢిల్లీ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. 20 నుంచి 25 ఏళ్ల వయస్సున్న నలుగురు నిందితులను గుర్తించారు. యమునా నదీ పరివాహక ప్రాంతంలో నివసించే నిందితులను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ రాయబారి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆయనకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.