Aravind Kejriwal : సీనియర్ సిటిజన్స్ కు ఉచిత వైద్యం : ఆప్ ఎన్నికల హామీ

by M.Rajitha |
Aravind Kejriwal : సీనియర్ సిటిజన్స్ కు ఉచిత వైద్యం : ఆప్ ఎన్నికల హామీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) దగ్గర పడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పలు ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ప్రకటించారు. 'సంజీవని యోజన'(Sanjivani Yojana) పేరుతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్స్ అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందజేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఒకటీ రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెడతామని, అనంతరం జారీ చేసే కార్డ్ తో ఎలాంటి లిమిట్ లేకుండా వృద్ధులకు చికిత్స అందిస్తామని అన్నారు. ప్రస్తుతం జారీ చేసే కార్డుతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తామని కేజ్రీవాల్ తెలియ జేశారు.

Advertisement

Next Story