- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ న్యూస్: రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు.. బంధం తెంచుకుంటామని మిత్రుడు స్వీట్ వార్నింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం అసాధ్యం. ఇవాళ రైట్ అనుకునేది రేపు రాంగ్ అవ్వొచ్చు. ఇవాళ రాంగ్ అనుకున్నదే రేపు రైట్ అవ్వొచ్చు. రాహుల్ విషయంలో అచ్చం ఇదే జరుగుతోందా అనే సందేహాలు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. 2019 నాటి కేసులో కోర్టు తీర్పుతో అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయనకు మద్దతుగా పలు ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన (యూబీటీ) మాత్రం అనూహ్యంగా రాహుల్ గాంధీకి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది.
మా దేవుడిని అవమానించడం మానుకో:
రాహుల్ గాంధీ చేసిన 'మోడీ' వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుండగానే 'సావర్కర్' వ్యాఖ్యలు ఆయనకు మరింత చిక్కుల్లో నెట్టేలా మారాయి. 'తన పేరు రాహుల్ గాంధీ అని తాను క్షమాపణలు చెప్పడానికి సావర్కర్‌ను కాదు' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాహుల్ వ్యాఖ్యలపై మహా సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా.. తాజాగా కాంగ్రెస్ మిత్రుడు ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత వీర సావర్కర్‌ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని ఉద్ధవ్ హెచ్చరించారు.
అంతే కాదు వ్యవహారం ఇలాగే కొనసాగితే ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా మందలించారు. వీరసావర్కర్ మా దేవుడు. మా దేవుళ్లను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ రాహుల్ గాంధీని రెచ్చగొడుతోందని అలర్ట్ చేశారు. మరో వైపు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సైతం సోమవారం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ సావర్కర్ మా స్ఫూర్తి అన్నారు. ఉద్ధవ్ వర్గం నుంచి వస్తున్న ఈ హెచ్చరికలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
రాహుల్ లాజిక్ మిస్ అవుతున్నారా?
బీజేపీ భావజాలంపై పోరాటం చేస్తున్నానని చెబుతున్న రాహుల్ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి సావర్కర్ కు మధ్య కోర్ బాండింగ్ ఉందనేది రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా తెలిసిన విషయమే. ఇదే సమయంలో సావర్కర్ ఐడియాలజీని దేశంలోని ఓ సెక్షన్ ఆఫ్ ప్రజలు అంగీకరిస్తున్నారు. మహారాష్ట్ర సావర్కర్ కు సొంత రాష్ట్రం కావడం చేత అక్కడి రాజకీయాల్లో సావర్క్ బ్రాండ్ కీలక పాత్ర పోషిస్తుంది.
తాను గాంధీని అని ప్రొజెక్ట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీ సావర్కర్‌ను టార్గెట్ చేస్తే అది మహారాష్ట్రలోని తన మిత్రపక్షాలను దూరం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ వ్యూహంలో తక్షణ అవసరాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యమే. అందువల్ల మిత్ర పక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సావర్కర్ విషయంలో రాహుల్ వెనక్కి తగ్గుతారా లేదా తన మిత్రులనే దూరం చేసుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.