పురుషుడిగా మారబోతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కూతురు!

by Javid Pasha |   ( Updated:2023-06-21 16:29:28.0  )
పురుషుడిగా మారబోతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కూతురు!
X

దిశ, వెబ్ డెస్క్: తాను పురుషుడిగా మారబోతున్నట్లు చెప్పారు బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కూతరు సుచేతన భట్టాచార్య. అందుకోసం తాను లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎల్జీబీటీక్యూ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆమె తన మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు. తనకు పురుషుడిగా ఉండటం చాలా ఇష్టమని, అందుకోసం ఆపరేషన్ చేయించుకోబోతున్నట్లు తెలిపారు. తనకిప్పుడు 42 ఏళ్లు అన్న ఆమె.. తన జీవితం గురించి తనకు నచ్చిన విధంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు.

దయచేసి ఎవరూ కూడా ఈ విషయంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని రిక్వెస్ట్ చేశారు. తాను మానసికంగా మగవాడిగా ఉన్నానని, ఈ క్రమంలోనే శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత తన పేరును సుచేతన్ గా మార్చుకోబోతున్నట్లు చెప్పారు. కాగా సుచేతన తండ్రి బుద్ధాదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా పని చేశారు.

ఇవి కూడా చదవండి:

సెక్స్ లో పాల్గొనే ముందు ఈ పనులు అసలు చేయకూడదట..

తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులు.. తప్పక తెలుసుకోండి

Advertisement

Next Story