ఐస్ క్రీమ్‌లో వేలు.. ఎలా వచ్చిందో కనిపెట్టిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్

by Indraja |   ( Updated:2024-06-28 07:32:22.0  )
ఐస్ క్రీమ్‌లో వేలు.. ఎలా వచ్చిందో కనిపెట్టిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్
X

దిశ వెబ్ డెస్క్: చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్‌ను ఇష్టపడతారు. ప్రస్తుతం పెరిగిన సాకేతికత కారణంగా ఎదీకావాలన్నా కాలు కింద పెట్టకుండానే సరాసరి ఇంటికే డోర్ డెలివరి ఫెసిలిటీ సైతం వ్యాపారస్తులు కల్పిస్తున్నారు. దీనితో చాలా మంది తినే తిండి నుండి పడుకునే బెడ్ వరకు ఆన్లైన్‌లో ఆర్డర్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందరిలానే ఆన్లైలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ మహిళా డాక్టర్‌కి ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు దర్శనమిచ్చి సంచలనం రేపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

పదిహేను రోజుల క్రింతం ముంబై లోని మలాడ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి ఐస్ క్రీం తినాలని తలచి యుమ్మో బటర్ స్కాచ్ ఫ్లేవర్ 3 కోన్ ఐస్ క్రీంలను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది. కొత సమయానికి ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఇంటికి డెలివరీ చేయగా.. ఆ దానిని తినడం ప్రారంభించిన కొద్దిసేపటికి నోటికి ఏదో తగిలినట్టుగా అనిపించింది.

వెంటనే పరీక్షించి చూడటంతో కోన్ ఐస్ క్రీంలో 2 అంగులాల మనిషి వేలు బయటపడడంతో కంగుతిన్నది. వెంటనే పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నయోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పుణేలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఓంకార్ పొటే అనే వ్యక్తి ఐస్ క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మెషీన్‌లో పడి మిడిల్ ఫింగర్ తెగిపడిపోయినట్టుగా గుర్తించారు. అయితే మనిషి వేలు తెగిపడిన ఐస్‌క్రిమ్‌ను పారేయకుండా, నింబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేసి మార్కెట్‌లోకి కంపెనీ విడుడదల చేసింది.

Advertisement

Next Story