మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Kalyani |
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,గీసుగొండ: భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని మనస్థాపం చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన బాషనపల్లి శ్రీనివాస్ 15 సంవత్సరాల క్రితం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన ఓరుగంటి మంజులతో వివాహం జరగగా, సంతానం కలగలేదు. గత ఏడు నెలల క్రితం అతన్ని భార్య పెద్దమనుషుల సమక్షంలో పిల్లలు కావట్లేదని విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. అప్పటినుండి శ్రీనివాస్ మనోవేదనకు లోనై తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో 26/12/2024 రోజు రాత్రి 10 గంటల సమయంలో అతని నోటి నుండి నురగ వస్తుండగా అతని కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి 11:52 నిమిషాలకు చనిపోయాడని మృతుడి చెల్లెలు బాపనపల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed