ఎర్రగడ్డ లో మహిళ అదృశ్యం

by Kalyani |
ఎర్రగడ్డ లో మహిళ అదృశ్యం
X

దిశ, జూబ్లీహిల్స్: చికిత్స నిమిత్తం వచ్చిన మహిళ అదృశ్యం అయిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి , తిరాకుపల్లి కి చెందిన ఆర్.పోచవ్వ (60) , వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటుంది. మానసికంగా బలేకపోవటం తో కొడుకు తో కలిసి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి శుక్రవారం వచ్చారు. రోడ్డు పక్కన వాటర్ కోసం అని వచ్చిన మహిళ ఆర్.పోచవ్వ తప్పిపోవటంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె కొడుకు బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed