- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెహిస్ ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: ఇమ్మిగ్రేషన్ అంతర్జాతీయ చట్టపరమైన విషయాలలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ న్యాయ సంస్థ గెహిస్ ఇమ్మిగ్రేషన్(Gehis Immigration), ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్, హైదరాబాద్, నాలెడ్జ్ పార్క్‌లో కొత్త బ్రాంచ్(New branch) ప్రారంభం అయింది. దీనిని తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సుధా జైన్ సోషలైట్, నరేష్ ఎం గెహి ముఖ్యతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంక్లిష్ట ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ చట్టపరమైన సవాళ్లను ప్రతిబింబిస్తూ చేసే వ్యక్తులు, కుటుంబాలు వ్యాపారాలకు వ్యక్తిగతీకరించిన, సమర్థవంతమైన, అత్యాధునిక న్యాయ సేవలను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని నిర్వహాకులు అన్నారు. ఈ సందర్భంగా గెహిస్ ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ నరేష్ ఎం గెహి మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య ఇమ్మిగ్రేషన్ సంబంధిత వ్యవహారాలు, ఇబ్బందులు తొలగించి కుటుంబం, బిజినెస్, వ్యక్తిగతంగా వివిధ రకాల వీసాల సమస్యల పరిష్కారంలో గేహిస్ ఇమ్మిగ్రేషన్ ప్రత్యేకం అన్నారు.
భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అంతరాన్ని తగ్గించే మా ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి, ఎదుగుదల ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుందన్నారు. చదువు, బిజినెస్, గ్రీన్ కార్డ్, వ్యవస్థల బదిలీ, స్పోర్ట్స్ రిలేటెడ్‌కు సంబధిత హెచ్ 1బీ, LIA, Eb5, EB-1C, Eb-1A, P వంటి పలు రకాల వీసాలు భారత్ అమెరికా దేశాలమధ్య భవిషత్తు, పురోగతికి మంచి తోడ్పాటునిస్తాయని తెలిపారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతున్నందున, తాము తమ ఖాతాదారులకు అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.