Bloody sweet blood.. మరో ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసిన అనుష్క

by sudharani |
Bloody sweet blood.. మరో ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసిన అనుష్క
X

దిశ, సినిమా: అనుష్క శెట్టి(Anushka Shetty) ‘మిస్ట్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) సినిమా తర్వాత.. ప్రజెంట్ ‘ఘాటీ’(Ghati movie ) చిత్రంలో నటిస్తుంది. ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే అనుష్క ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో ‘ఘాటీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనుష్క సీరియస్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోను షేర్ చేసి సినిమా అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా.. ‘Bloody sweet blood’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఫొటోలో.. అనుష్క ముఖం, చేతులపై బ్లడ్ ఉండగా.. చేతిలో పెద్ద ఖడ్గం పట్టుకుని కనిపించింది. ప్రజెంట్ ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచే విధంగా వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed