- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
South Korea : మొన్న దేశ అధ్యక్షుడిని.. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిని ఇంటికి పంపారు
దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణ కొరియా(South Korea)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ప్రధానమంత్రి హాన్ డక్ సూ(Han Duck soo) కూడా అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 192 మంది ఎంపీలు ఓట్లు వేశారు. దీంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. తాత్కాలిక దేశాధ్యక్షుడి అభిశంసనకు సాధారణ మెజారిటీ సరిపోతుందని జాతీయ అసెంబ్లీ స్పీకర్ వూ వాన్ షిక్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ ఎంపీలు.. అభిశంసన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ పరిణామంతో అంతకుముందు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా వ్యవహరించిన యూన్ సుక్ యోల్ హయాంలో మొదలైన రాజకీయ సంక్షోభం కొనసాగుతోందని స్పష్టమైంది.
మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సంబంధించిన అభిశంసన ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు హాన్ డక్ సూ నిరాకరించారని విపక్ష పార్టీలు ఆరోపించాయి. యూన్ సుక్ యోల్ అభిశంసన ప్రక్రియపై విచారణ జరిపి, తీర్పును వెలువరించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుకు హాన్ నో చెప్పారని తెలిపాయి. అందుకే ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశాయి. ఇక తన అభిశంసనపై హాన్ డక్ సూ స్పందిస్తూ.. ‘‘పార్లమెంటు నిర్ణయాన్ని గౌరవిస్తాను. రాజ్యాంగ బెంచ్ తీర్పు కోసం ఎదురుచూస్తాను’’ అని వెల్లడించారు. అయితే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకు దక్షిణ కొరియా విదేశాంగ, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించాలని హాన్ డక్ సూను అధికార పార్టీ నేత కియోన్ సియోంగ్ డాంగ్ కోరారు.