అస్సాంలో వరదల విలయం.. నిరాశ్రయులైన 4.88 లక్షల మంది

by Javid Pasha |
అస్సాంలో వరదల విలయం.. నిరాశ్రయులైన 4.88 లక్షల మంది
X

గౌహతి : అస్సాంను గత వారం రోజులుగా కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర, మానస్‌, పుతిమరి, పగ్లాదియ నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో వేలాది గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులై కొండలు, గుట్టల మీద తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో దాదాపు 4,88,525 మంది వరదతో ప్రభావితమయ్యాయని అస్సాం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌డీఎంఎ) శనివారం వెల్లడించింది. 1,538 గ్రామాలు నీటమునిగాయని తెలిపింది.

వరదలకు బజలి జిల్లాలో 2,67,253 మంది.. బార్పేట జిల్లాలో 73,233 మంది నిరాశ్రయులయ్యారు. 14 జిల్లాల్లో రాష్ట్ర యంత్రాంగం నిర్వహిస్తున్న 225 సహాయక శిబిరాల్లో కనీసం 35,142 మంది తలదాచుకున్నారు. బజలి జిల్లాల్లో అత్యధికంగా 73 సహాయక శిబిరాలను ఏర్పాటు చేయగా.. వాటిలో సుమారు 15,841 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరదలతో రాష్ట్రంలో 10,782 హెక్టార్ల పంట భూములు నీట మునిగాయి. దీంతో పెద్ద మొత్తంలో పంటనష్టం జరిగింది.


Advertisement

Next Story

Most Viewed