- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయన్- ధనుష్ వివాదంపై సీనియర్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు.. అతని మాటలు విని షాకయ్యానంటూ..
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార.. తన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'లో 'నానుమ్ రౌడీ దాన్' సినిమాకు సంబంధించి 3 సెకన్ల వీడియోను వాడుకున్నందుకు ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తనకు లీగల్ నోటీసులు పంపించారంటూ ధనుష్‌కి నయన్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. సినీ స్టార్స్, అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి ధనుష్‌కు కొందరు, నయనతారకు మరికొందరు సపోర్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ స్పందించారు. ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు.
‘నానుమ్ రౌడీ దాన్‘ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ మధ్య ప్రేమ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ధనుష్ తనకు ఫోన్ చేసి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి చెప్పారన్నారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఉన్న దాని ప్రకారం.. “ధనుష్ నాకు ఫోన్ చేసి “అక్క, నీకు సిగ్గు లేదా?” అని అన్నాడు. అప్పుడు “నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు” అని అన్నాను. ఇక ధనుష్ “ఏం జరుగుతుందో మీకు తెలియదా? విక్కీ, నయన్ డేటింగ్‌లో ఉన్నారనే విషయం కూడా మీకు తెలియదా?” అని అన్నాడు. “నాకు నిజంగా తెలియదు. నువ్వు చెప్తేనే తెలిసింది అన్నాను” అని రాధిక చెప్తుంది. ప్రస్తుతం ఈ క్లిప్ నయనతార డాక్యుమెంటరీలో ఉన్నట్లు తెలుస్తోంది.