- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు తుఫానుతో వణికిపోతున్న యూఎస్..
న్యూయార్క్: భయంకరమైన మంచు తుఫాను కారణంగా అరిజోనా నుంచి వ్యోమింగ్ వరకు అంతరాష్ట్ర రహదారులను మూసివేయాల్సి వచ్చింది. చాలా మంది కార్లలోనే చిక్కుకుపోయారు. వందల వేలాది మంది ప్రజలు విద్యుత్ లేకుండానే గడపాల్సి వచ్చింది. దశాబ్దకాలంలో దక్షిణ కాలిఫోర్నియాలో ఇటువంటి మంచు తుఫాను రావడం ఇదే తొలిసారి. ఈ మంచు తుఫాను వల్ల ప్రజలు ఏడు రోజులు దుర్భర జీవితన్ని అనుభవించారు. ఈ క్రూరమైన వాతావరణం కొన్ని ప్రాంతాలను తాకలేదు.
ఈ మంచు తుఫాను వల్ల పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. మిన్నెసోటా శాసనసభను కూడా మూసేశారు. ప్రయాణం కష్టతరమైంది. ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1600 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో 400కు పైగా విమానాలు మిన్నియాపాలిస్ నుంచి సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి లేదా బయల్దేరాల్సి ఉండింది. దేశ వ్యాప్తంగా 5 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.
వ్యోమింగ్‌లో కార్లలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రక్షణ దళాలు ప్రయత్నించాయి. కానీ అధికగాలులు, దట్టమైన మంచు కురవడం వల్ల సాధ్యపడలేదని వ్యోమింగ్ హై వే పెట్రోలింగ్ అధికారి సార్జంట్ జెరెమీ బెక్ తెలిపారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని క్యాస్కేడ్ పర్వతాల వద్ద అధిక గాలులు వీయడం, భారీగా మంచు కురవడం వల్ల వాష్టింగన్‌లోని కోల్‌చక్ శిఖరంపై హిమపాతంలో చిక్కుకుని మరణించిన ముగ్గురు పర్వతారోహకుల మృతదేశాలను కనుగొనలేకపోయారు.
బలమైన గాలులు కాలిఫోర్నియాలో పెద్ద సమస్యనే తెచ్చిపెట్టాయి. బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని దాదాపు 65 వేల మంది విద్యుత్ లేకుండానే జీవించాల్సి వచ్చింది. 1989 తర్వాత మొదటిసారిగా లాస్ ఏంజెల్స్, వెంచురా, శాంటా బార్బరా పర్వతాలకు మంచు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఇది ఫిబ్రవరి 23 ఉదయం 4 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.