Bihar: బీహార్‌లో కొత్త చట్టాల కింద మొదటి శిక్ష.. ఇద్దరికి జీవిత ఖైదు

by S Gopi |
Bihar: బీహార్‌లో కొత్త చట్టాల కింద మొదటి శిక్ష.. ఇద్దరికి జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కొత్త చట్టాలు అమలైన తర్వాత బీహార్‌లో మొదటి శిక్షను కోర్టు విధించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టం కింద ఓ హత్య కేసులో బీహార్‌లో ఇద్దరికి తొలి శిక్షను విధిస్తూ సెషన్ కోర్టు తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన రెండు నెలల వ్యవధిలోనే కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. బీహర్‌లోని శరణ్ జిల్ల్లాలో ఈ ఏడాది జూలై 17న ఓ కుటుంబంపై దాడి జరిగింది. ధనాదిహ్ గ్రామంలోని తారకేశ్వర్ సింగ్ కుటుంబంపై జరిగిన ఈ దాడిలో దుండగులు నిద్రలో ఉన్న వారిపై దారుణంగా కత్తులతో పొడిచారు. ఈ ఘటనలో తారకేశ్వర్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మరణించారు. అతని భార్య తెవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం, దాడిలో పాల్గొన్న అంకిత్, సుధాన్షు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన రెండు వారాల్లోనే వారిద్దరిపై ఛార్జీషీట్ దాఖలు చేయగా, మంగళవారం విచారణ సమయంలో కోర్టు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. గురువారం తీర్పు సందర్భంగా వారికి జీవిత ఖైదు విధిస్తూ శిక్షను ఖరారు చేసింది.

Advertisement

Next Story