Fifth man-eater wolf caught: బహ్రెయిచ్ లో పట్టుబడిన ఐదో తోడేలు

by Shamantha N |
Fifth man-eater wolf caught: బహ్రెయిచ్ లో పట్టుబడిన ఐదో తోడేలు
X

దిశ,నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్‌ వాసులు తోడేళ్ల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా.. ఇప్పుడు ఆ తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు. ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటివరకు ఐదు నరమాంసభక్షక తోడేళ్లను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది. ఇంకా ఒక తోడేలు స్వేచ్ఛగా తిరుగుతోందన్నారు. దానిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.

10 మంది మృతి

గత రెండు నెలల్లోనే తోడేళ్ల వల్ల పది మంది చనిపోయారు. మృతిచెందిన వారిలో తొమ్మిద మంది పిల్లలే. ఇకపోతే, తోడేళ్ల వల్ల మరో 36 మంది గాయపడ్డారు. బహ్రెయిచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో తోడేళ్ల భయం పట్టుకుంది. గ్రామాల్లో దాదాపు డజనకు పైగా తోడేళ్ల సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. అయితే, వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. రాత్రి వేళల్లో అటవీశాఖ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోడేళ్ల దాడులను 'వన్యప్రాణుల విపత్తు'గా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed