దైవిక శక్తిని అనుభవిస్తున్నా.. 45 గంటల ధ్యానం తర్వాత మోడీ స్పందన ఇదే

by Shamantha N |
దైవిక శక్తిని అనుభవిస్తున్నా.. 45 గంటల ధ్యానం తర్వాత మోడీ స్పందన ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో: క‌న్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియ‌ల్‌లో ప్రధాని మోడీ 45 గంటలపాటు ధ్యానం చేశారు. ధ్యాన ముద్రను వీడాక ప్రధాని మోడీ రాసిన నోట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాక్ మెమోరియల్ ని సందర్శించినప్పుడు తానొక దైవిక శక్తిని అనుభవిస్తున్నానని నోట్ లో మోడీ పేర్కొన్నారు. అక్కడే పార్వతీ దేవి, స్వామి వివేకానంద ధ్యానం చేశారని తెలిపారు. వివేకానంద ఆలోచనలకు జీవం పోసిన ఈ శిలను ఏకనాథ్ రనడే.. శిలాస్మారక్ గా మార్చారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత వివేకానంద విలువలు, ఆదర్శాలు మూర్తీభవిస్తున్న.. పవిత్రస్థలంలో ధాన్యం చేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ 'శిలా స్మారక్'లో తాను చేసిన ధ్యానం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తన జీవితం దేశసేవకే అంకితం అని నోట్ లో రాసుకొచ్చారు. దేశ పురోగతి, పౌరుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. భారత మాతకి రుణపడి ఉంటానని మోడీ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం 6.45 నిమిషాల‌కు ప్ర‌ధాని మోడీ ధ్యానంలో కూర్చున్నారు. ధ్యాన స‌మ‌యంలో ఆయ‌న కేవ‌లం ద్ర‌వ ప‌దార్థాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 45 గంట‌ల పాటు ఆయన మౌనంగానే ఉన్నారు.

Advertisement

Next Story