- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు 13 మంది స్పాట్ డెడ్..
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంప్రదాయ సంగీత కచేరీ బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరంతా పుణేలోని పింప్రీ చించ్వాడ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఖోపోలీ సమీపంలోని పాత ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేలో ఈ ప్రమాదం సంభవించిందిస్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం క్షతగాత్రులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.