విపక్షాల మీటింగ్‌కు ఫరూక్, మెహబూబా..

by Vinod kumar |
విపక్షాల మీటింగ్‌కు ఫరూక్, మెహబూబా..
X

పాట్నా: ఈ నెల 23వ తేదీన జరిగే బీజేపీయేతర విపక్ష పార్టీల సమావేశానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరవుతారని జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లాలన్ తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు 18 పార్టీల నాయకులు అంగీకరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సహా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరవుతారని పేర్కొన్నారు.

విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చేందుకు తనకు ఆసక్తి లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ పదే పదే చెబుతున్నప్పటికీ.. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొస్తున్న నితీష్‌కే పీఎం అయ్యే అర్హత ఉందని ఆయన పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ‘వన్ టు వన్’ పోటీ చేసేందుకు ఒప్పించడంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, పీఎం పదవిపై చర్చ ఉండబోదని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ లాలన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed