Sunitha Laxma Reddy: చరిత్రలో ఇదే మొదటిసారి

by Gantepaka Srikanth |
Sunitha Laxma Reddy: చరిత్రలో ఇదే మొదటిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshmareddy) అన్నారు. శనివారం ఆమె తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. కానిస్టేబుళ్ల(Constables) భార్యలు, కుటుంబ సభ్యులు ఈ విధంగా ధర్నాలు చేసిన ఘటన మాత్రం ఎక్కడ ఉండదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్దనే హోంశాఖ(Home Minister) ఉందని.. దీనిపై వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ(Police System)ను కాపాడుకోవాలని కోరారు. పోలీసులతో ఇళ్ళలో వివిధ పనులు చేయించుకుంటున్నారని విమర్శలు చేశారు. సచివాలయం ఎదుట బందోబస్తు చేయాల్సిన పోలీసులు.. ధర్నాలు చేయడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. కరోనా సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగలేదని తెలిపారు. కానిస్టేబుల్(Constables) కుటుంబాల బాధ చూస్తుంటే మనసుకు బాధగా ఉందని అన్నారు.

Advertisement

Next Story