- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలోని RamLeelaమైదాన్‌లో మళ్లీ రైతుల నిరసన!
దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కిసాన్ గర్జన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 560 జిల్లాలకు చెందిన 60 వేల గ్రామ కమిటీల నుంచి భారీ సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు రాంలీలా మైదానం చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలపై వారం రోజుల పాటు పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
రైతు వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయడంతో పాటు పంటలపై కనీస మద్దతు ధర చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న మద్దతు ధర రూ.6వేల నుంచి రూ.12వేలకు పెంచడం, రైతు ఉత్పత్తులపై లాభసాటి ధర ఇవ్వాలన్న డిమాండ్లతో రైతులు ఆందోళనకు దిగారు. జన్ జాగరణ్ కార్యక్రమంలో కోసం రైతులు రాంలీలా మైదాన్‌కు చేరుకోవడంలో భాగంగా నాలుగు నెలల క్రితం ర్యాలీ ప్రారంభమైంది. ఈ నాలుగు నెలల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో భారీ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 వేల కిలోమీటర్ల పాదయాత్ర, 13 వేల కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలు 18 వేల వీధి సమావేశాలను రైతు సంఘాల నాయకులు నిర్వహించారు.