- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad: వయనాడ్ కు ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ భారీ సాయం
దిశ, డైనమిక్ బ్యూరో: వయనాడ్ కు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భారీ సాయం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి 5 కోట్ల సాయం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ సందర్భంగా.. వయనాడ్‌లో జరిగిన ఘోరమైన ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, బాధిత కుటుంబాలకు నా హృదయం వెల్లివిరుస్తోందని అన్నారు. అంతేగాక ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని చెబుతూ.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయల విరాళంతో మా మద్దతును అందిస్తున్నామని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 150 మందికి పోగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో వందల మంది గాయలపడగా.. మరి కొందరు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది. ఈ ఘటన చాలా మందిని దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఇక ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నారు.