ట్రంప్ వర్సెస్ బైడెన్.. బిగ్ డిబేట్ ఎలా జరిగిందంటే?

by Shamantha N |
ట్రంప్ వర్సెస్ బైడెన్.. బిగ్ డిబేట్ ఎలా జరిగిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఇరువురు నేతల మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. 2020 అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. అట్లాంటాలో సీఎన్‌ఎన్‌ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు.

ఆర్థికవిధానాలపై ప్రారంభమైన చర్చ

ట్రంప్‌ హయాంలో అనుసరించిన ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తూ బైడెన్‌ చర్చను ప్రారంభించారు. ధనవంతులపై ట్రంప్ అనుకూల వైఖరి చూపడంతోనే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఉద్యోగ కల్పన పూర్తిగా క్షీణించిందన్నారు. నిరుద్యోగం 15 శాతానికి చేరిందన్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన బాధ్యతను ప్రజలు తనపైన పెట్టినట్లు పేర్కొన్నారు. బైడెన్ హయాంలోనే అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆయనపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని ట్రంప్ విమర్శలు గుప్పించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి..

అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఘోరంగా విఫలమైందని బైడెన్ పై విరుచుకుపడ్డారు. అఫ్గాన్ పౌరులను తాలిబన్లు చంపుతూనే ఉన్నారని కానీ ట్రంప్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అక్కడ చనిపోయిన సైనికులను ట్రంప్ దూషించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాక్‌లో పనిచేసి తర్వాత మరణించిన తన కుమారుడు బ్యూను బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా గురించి మాట్లాడుతూ.. పుతిన్‌కు ట్రంప్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. పైగా అనేకమంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందునే రష్యా ప్రతిదాడి చేస్తోందని సమర్థించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు.

అబార్షన్ నిషేధం పై..

అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారారాలు చేస్తున్నారన్నాని బైడెన్ తెలిపారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో భద్రత విషయంలోబైడెన్‌ విఫలమయ్యారని తెలిపారు. దీన్ని బైడెన్‌ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తాననన్నారు. అబార్షన్లపై నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన ‘రో వర్సెస్‌ వేడ్‌’ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. మరోవైపు ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అబార్షన్లపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Next Story

Most Viewed