గోవా గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్

by Mahesh |
గోవా గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘రామచిలుక’ పుస్తకంలో తెలివైన మరియు ఆలోచింపజేసే కథలతో పాఠకులను రచయిత కట్టిపడేశారని రాష్ట్ర గవర్నర్ పీసీ రాధాకృష్ణన్ అన్నారు. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్‌ పిళ్లై రచించిన ‘రామచిలుక’ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ శ్రీధరన్ పిళ్లై ఈ రచనలో తన సాహిత్య నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. ‘రామచిలుక’ అతని బహుముఖ ప్రజ్ఞకు, శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సాహిత్య వారసత్వానికి చేసిన అమూల్యమైన కృషిని కొనియాడారు. ఈ పుస్తకానికి తగిన గుర్తింపు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, గోవా గవర్నర్ కార్యదర్శి ఎంఆర్ఎం రావు, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, కె. శివారెడ్డి, రాంచందర్ రావు, ఎల్.ఆర్. స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed