అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకో: బైడెన్‌కు బాల్య స్నేహితుడి సూచన

by Vinod |
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకో: బైడెన్‌కు బాల్య స్నేహితుడి సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష పదవికి బైడెన్, ట్రంపులు ఇద్దరూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇటీవల ఓపెన్ డిబేట్ జరిగింది. అయితే ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పేలవ ప్రదర్శన ఇచ్చారు. దీంతో ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తాజాగా బైడెన్ బాల్య స్పేహితుడు జే పారిని కూడా బైడెన్‌కు సూచనలు చేశారు. సీఎన్ఎన్ ఓపీనియన్ పేజీలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘అమెరికన్ చరిత్రలో కొద్దిమంది నాయకులు విశాల హృదయాన్ని, మితవాద భావాన్ని కలిగి ఉన్నారు. వారిలో నువ్వు కూడా ఉన్నందుకు గర్వపడుతున్నా. కానీ నా లాగే ప్రస్తుతం నీవు కూడా వృద్ధుడివి అయిపోయావు. రోజంతా కదిలే శక్తిని కూడా కూడగట్టు కోలేని పరిస్థితి ఉంటుంది. ఒకప్పటిలా మన శరీరాలు సహకరించవు. కొన్నిసార్లు ఉదయం లేవడం కూడా బాధిస్తుంది. కాబట్టి అధ్యక్ష పదవిపై ఒక్కసారి పునారోలోచించుకో’ అని తెలిపారు. ‘ఇటీవల జరిగిన డిబేట్‌లో వేదిక మీదకు రావడానికే ఇబ్బంది పడ్డావు. అంతేగాక అంతా గందరగోళంగా ఉండటం, తడబడం నాకు కనిపించింది. ఈ పరిస్థితి చూశాక నేను కన్నీరు పెట్టుకున్నాను’ అని తెలిపారు. దేశం కోసం గొప్ప మనసుతో పదవీ విరమణ గురించి ఆలోచించాలని సూచించారు. బైడెన్ వల్లే దేశం బలపడిందనే విషయం గుర్తు చేశారు.

Next Story

Most Viewed