పాఠశాలను విడిచి వెళ్ళవద్దు…కంటతడి పెట్టిన చిన్నారులు

by Kalyani |
పాఠశాలను విడిచి వెళ్ళవద్దు…కంటతడి పెట్టిన చిన్నారులు
X

దిశ, ఊట్కూర్ : ఇంటికి వచ్చిన బంధువులు వెళ్ళిపోతుంటేనే పిల్లలు మారం చేస్తుంటారు. అలాంటిది విద్యా బోధన నేర్పిన ఉపాధ్యాయులు వెళుతుంటే ఊరుకుంటారా…తమని విడిచి వెళ్లకూడదు అంటూ బోరున ఏడుస్తూ అడ్డుకున్నారు. ఈ సన్నివేశం ఊట్కూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ పాఠశాలలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మండల పరిధిలోని మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్న నర్సింగప్ప ఇటీవల బదిలీల్లో భాగంగా నర్సింగప్పను పెద్దపోర్ల గ్రామా పాఠశాలకు బదిలీ అయ్యారు. చివరి రోజున ఆయన స్కూల్‌ కి వచ్చి వెళ్తున్న క్రమంలో పిల్లలంతా కలిసి తమను వదిలి వెళ్ళవద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారుల ప్రేమ ఆప్యాయత చూసి హెచ్ఎం సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఎవ్వరూ ఏడవొద్దని తాను మళ్లీ వస్తానంటూ పిల్లలను సముదాయించి అక్కడి నుంచి ఆయన బరువైన హృదయంతో బయలుదేరారు.

Next Story

Most Viewed