బెంగాల్‌లో మహిళను కొట్టిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు

by Gopi |
బెంగాల్‌లో మహిళను కొట్టిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రాలో 'అక్రమ సంబంధం' కలిగి ఉన్నారనే కారణంతో ఓ జంటపై జరిగిన దాడికి సంబంధించిన వైరల్ వీడియోపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా రాజకీయ పార్టీల నేతలు ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అయిన వీడియో కర్రతో ఇద్దరిని కొట్టిన వ్యక్తి తాజెముల్ అలియాస్ ‘జేసీబీ’ అనే స్థానిక టీఎంసీ నేత అని బీజేపీ ఆరోపణలు చేసింది. మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన 'సాలిషి సభ' (కంగారూ కోర్టు) వద్ద జరిగింది. పోలీసు అధికారులు సోషల్ మీడియాలో ఉన్న వీడియో క్లిప్‌ని చూశారని, ఘటన నిర్ధారణ అయిన తర్వాత కేసు నమోదు చేసినట్టు ఇస్లాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ జోబీ థామస్ కె మీడియాకు తెలిపారు. 'మేము నేరస్థుడిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించాం. దీని వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తామ'ని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలను వికృత రూపం. ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియోలోని వ్యక్తి తన ఇన్సాఫ్ ద్వారా సత్వర న్యాయం అందించడంలో రాటుదేలాడు. అతను చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్‌కు సన్నిహితుడని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కానీ, టీఎంసీ ఎమ్మెల్యే ఆ వ్యవహారంతోనూ, వీడియోలో ఉన్న నిందితుడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.

Next Story

Most Viewed