Sujeet Kumar: బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన గంటల్లోనే బీజేపీలో చేరిక

by Shamantha N |
Sujeet Kumar: బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన గంటల్లోనే బీజేపీలో చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: బిజూ జనతాదళ్‌ (BJD) పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ సుజీత్‌ కుమార్‌ (Sujeet Kumar) బీజేపీ(BJPS)లో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Union Minister Dharmendra Pradhan), బీజేపీ ఎంపీ భర్తృహరి (MP Bhartruhari Mahatab) సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "బీజేడీ నాయకులు నన్ను విస్మరించారు. పక్కన పెట్టారు. నన్ను పార్టీ నుండి తొలగిస్తామని పరోక్షంగా బెదిరించారు. బీజేడీ పార్టీకి రాజీనామ చేసిన తర్వాత నన్ను బహిష్రించడం హాస్యాస్పదంగా ఉంది" అని పేర్కొన్నారు. "ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ నాయకులు ధన్యవాదాలు. నేను రాజ్యసభకు రాజీనామా చేయడం చాలా పెద్ద నిర్ణయం. అవినీతి వల్ల నా స్వస్థలమైన కలహండి బీజేడీ హయాంలో అభివృద్ది చెందలేదు. కలహండిలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కొందరు బీజేడీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మరికొందరు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా నేను గళం విప్పాను. కలహండి ప్రయోజనాలను కాపాడేందుకే రాజ్యసభకు రాజీనామా చేశాను" అని సుజీత్ కుమార్ అన్నారు.

బీజేడీ నుంచి బహిష్కరణ

ఒడిశా సీఎం (Odisha chief minister) మోహన్‌ చరణ్‌ మాఝీ పరిపాలన నచ్చిందని అన్నారు. ఆయన సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. బీజేపీలో చేరడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో బీజేడీ సుజీత్‌కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేడీ ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ పేరుతో ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సుజీత్‌కుమార్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్ కర్ కలిసి తన రాజీనామా లేఖను అందించారు. సుజీత్ రాజీనామాకు ధన్‌కర్ వెంటనే ఆమోదం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed