ఎగ్జిట్ పోల్స్ ఓ కార్పొరేట్ గేమ్..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్

by vinod kumar |
ఎగ్జిట్ పోల్స్ ఓ కార్పొరేట్ గేమ్..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మండిపడ్డారు. దీనిని ‘కార్పొరేట్ గేమ్’గా అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎగ్జిట్ పోల్ అంచనాలు కార్పొరేట్ గేమ్. వారికి ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా గణాంకాలను విడుదల చేస్తారు. అధికారంలోకి వచ్చి డబ్బు ఉంటే, ఎగ్జిట్ పోల్స్ ద్వారా సొంత లెక్కలు విడుదల చేయొచ్చు. ఇండియా 295 నుంచి 310 సీట్ల మధ్య గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతో మోసపూరితమైనవని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థల యజమానులందరూ ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు. హోం మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లను పిలిచి హెచ్చరించారని, బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవలేరని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. గత 10 ఏళ్లుగా ఎగ్జిట్ గణాంకాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. మహావికాస్ అఘాడీకి మహారాష్ట్రలో 35 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. కాగా, శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్‌లో మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని అంచనా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed