హిమాచల్ సీఎం పీఠంపై ఉత్కంఠ.. Priyanka Gandhi నిర్ణయమే ఫైనల్

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-10 08:05:31.0  )
హిమాచల్ సీఎం పీఠంపై ఉత్కంఠ.. Priyanka Gandhi నిర్ణయమే ఫైనల్
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లో సీఎం ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించింది. ముఖ్యమంత్రి విషయమై శనివారం ప్రియాంక నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించారు. సీఎం ఎంపిక కోసం పరిశీలకులుగా వచ్చిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, హర్యాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం మరోసారి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

సీఎం పదవి కోసం పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, శాసన సభాపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, వీరభద్రసింగ్ కొడుకు విక్రమాదిత్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ తాను సీఎం పదవిని ఆశిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వీరభద్రసింగ్ కుటుంబానికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు కూడా ఆయా వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ నిర్ణయం ఎలా ఉండబోతోందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. మొత్తం 68 స్థానాలకు గాను 40 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed