Sandip Ghosh : జూనియర్ వైద్యురాలిపై దురాగతం కేసు.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌‌పై ఐఎంఏ వేటు

by Hajipasha |
Sandip Ghosh : జూనియర్ వైద్యురాలిపై దురాగతం కేసు.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌‌పై ఐఎంఏ వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సీరియస్‌గా తీసుకుంది. ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, డాక్టర్ సందీప్ ఘోష్ ఐఎంఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం విషయంలో సక్రమంగా స్పందించనందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఐఎంఏ వెల్లడించింది.

కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో ఆ ఘటనపై సందీప్ ఘోష్ సరిగ్గా స్పందించలేకపోయారని తెలిపింది. ఐఎంఏ బెంగాల్ విభాగం, వివిధ వైద్య సంఘాల డిమాండ్ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఐఎంఏ డిసిప్లినరీ కమిటీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed