కోల్‌కతా కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. నిందితుల కస్టడీ పొడిగింపు

by karthikeya |
కోల్‌కతా కేసులో కోర్టు కీలక ఆదేశాలు..  నిందితుల కస్టడీ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా (Kolkata)లో జూనియర్ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సిటీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్‌ల సీబీఐ కస్టడీ (CBI custody)ని సెప్టెంబర్ 20 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. గత నెల 9వ తేదీన కోల్‌‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రి (RG kar Hospital) సెమినర్ హాల్‌లో రాత్రి వేళ డ్యూటీ చేస్తున్న ట్రైనీ మహిళా డాక్టర్‌పై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో ముందుగా కోల్‌కతా పోలీసులు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్‌ను అరెస్టు చేయగా, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు అభిజిత్ మోండల్‌ను అరెస్టు చేసింది.

ఈ క్రమంలోనే కోర్టు వారిని సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే విచారణలో ఘోష్, మోండల్‌లు సహకరించడం లేదని, కస్టడీని పొడిగించాలంటూ సీబీఐ కోరడంతో బుధవారం నాడు సిటీ కోర్టు (City Court) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో ఘోష్, మోండల్ ప్రమేయం ఉన్నట్లు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా.. నిందితులిద్దరి కాల్ వివరాలు, కొన్ని నంబర్‌లకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు తమ విచారణలో తేలిందని, ప్రస్తుతం ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో నిందితులిద్దరూ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండనున్నారు.

ఇదిలా ఉంటే మాజీ ప్రిన్సిపాల్ ఘోష్‌తో సహా మిగిలిన నిందితులందరి విచారణ కోర్టు పర్యవేక్షణలో జరగాలని, ఆసుపత్రి (Hospital) అధికారుల తీరుపై విచారణ చేయాలని అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణకు మమత సర్కార్ సిట్‌ టీంను నియమించినా.. ఆగస్టు 13న ఆ టీంను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అలాగే, ఈ కేసును సుప్రీం కోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed