పేదలు, రైతులు, యువత, మహిళల కోసం పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం: ప్రధాని మోడీ

by Mahesh |
పేదలు, రైతులు, యువత, మహిళల కోసం పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, యువత, మహిళల కోసం పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ET వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు.. మూడవసారి మా ప్రభుత్వం 3 రెట్లు వేగంగా పని చేస్తుందని నేను చెప్పాను. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మా ఉద్దేశాలు బలంగా ఉన్నాయన్నారు. అలాగే గత 3 నెలల్లో భౌతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో నిమగ్నమై ఉన్నామని.. దేశంలోని పేదలు, రైతులు, యువత, మహిళల కోసం ఒకదాని తర్వాత ఒకటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నామని. మేము పేదల కోసం 3 కోట్ల కొత్త ఇళ్లను ఆమోదించాము. మేము ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రకటించామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story